కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మార్కెట్లో హ్యాండ్ శానిటైజర్లకు భలే గిరాకీ ఏర్పడింది. అయితే ఇదే అదునుగా చేసుకున్న కొందరు వ్యాపారులు.. నకిలీ శానిటైజర్లను ఉత్పత్తి చేస్తున్నారు. కర్నాటకలో క్రైం బ్రాంచ్ పోలీసులు సుమారు 56 లక్షల ఖరీదైన నకిలీ శానిటైజర్లను సీజ్ చేశారు. బెంగుళూరులో రెండు ఫ్యాక్టరీలపై దాడులు చేసిన తర్వాత వాటిని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు.