జలియన్‌వాలాబాగ్ మృతులకు ఇవాళ ప్రధాని మోదీ నివాళి అర్పించారు. వారి సాహసం, త్యాగాలను మరిచిపోలేమని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1919, ఏప్రిల్ 13వ రోజున జలియన్‌వాలాబాగ్‌లో 400 మందిని బ్రిటీష్ సైనికులు కాల్చి చంపారు. ఆ నాటి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు మోదీ తెలిపారు. వారు చూపిన వీరత్వం.. రానున్న తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. అమృత్‌సర్‌లో ఉన్న జలియన్‌వాలాబాగ్ స్మారక స్థూపాన్ని గతంలో సందర్శించిన ఫోటో తన ట్విట్టర్‌లో మోదీ పోస్టు చేశారు. 1919లో జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు ఓ గార్డెన్‌లో సమావేశమైన సాధారణ జనంపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఆ ఘటనలో 400 మంది మరణించారు. 2015లో అమృతసర్‌లో ఉన్న స్మారకాన్ని మోదీ సందర్శించారు.
జలియన్‌వాలాబాగ్ అమరులను గుర్తు చేసిన ప్రధాని మోదీ