అమీన్‌పూర్‌లో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు


జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌లోని సాయికృప కాలనీ లోని ఓ ప్రైవేటు స్కూల్‌ సమీపంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కాలనీలో ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులందరికీ, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఉన్నారు. కాలనీ మెయిన్‌ రోడ్లు అన్ని మూసివేయాలని మంత్రి ఆదేశించారు. అంతకు ముందుకు పటాన్‌చెరు మండల కేంద్రంలో ఆటోడ్రైవర్లకు మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.