హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అడవి పిల్లి ముచ్చెమటలు పట్టించింది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఏరో టవర్స్ సమీపంలో ఓ జంతువు తిరగడం గమనించారు. దానిని చిరుతగా భావించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలో కి దిగిన అటవీ శాఖ సిబ్బంది.. మూడు గంటలపాటు శ్రమించి దానిని బంధించారు. అయితే అది చిరుత కాదని.. అడవి పిల్ల అని తేల్చారు. దీంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది