బిల్‌గేట్స్‌ టిప్‌ ఫొటో ఫేక్‌

 అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ జీవితం.. భావితరాలకు స్పూర్తిదాయకం అంటూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఒకటి నకిలీదని  తేలింది. అపర కుబేరుడు బిల్‌గేట్స్‌.. రెస్టారెంట్‌ వెయిటర్‌కు టిప్‌ ఇస్తూ.. తాను ఒక సాధారణ వుడ్‌కట్టర్‌ (వడ్రంగి) కుమారుడినని తెలుపుతూ ఫేస్‌బుక్‌లో చాలామంది ఫార్వర్డ్‌ చేస్తున్న ఈ ఫొటోలో ఏమాత్రం నిజం లేదని.. ప్రముఖ మీడియా దిగ్గజం ఇండియా టుడే చేసిన నిజ-నిర్ధారణలో తేలింది. బిల్‌గేట్స్‌ తండ్రి వుడ్‌కట్టర్‌ (కలపను నరికే వ్యక్తి) కాదని స్పష్టం చేసింది. బిల్‌గేట్స్‌ బ్లాగ్‌ 'గేట్స్‌ నోట్స్‌' వివరాల ప్రకారం ఆయన తండ్రి విలియం హెచ్‌. గేట్స్‌ II.. సీటెల్‌ నగరంలో ఒక న్యాయవాది అని, తల్లి మేరీ గేట్స్‌ స్కూల్‌ టీచర్‌ అని పేర్కొన్నారు.